కరోనా రోగి మృతదేహంపై 6 గంటల తర్వాత వైరస్ ఉండదని డబ్ల్యూహెచ్ఓ కూడా తెలిపింది: ఆళ్ల నాని

  • నెల్లూరు జిల్లాలో ఆళ్ల నాని సమీక్ష
  • కొవిడ్ రోగులతో ఆన్ లైన్ లో మాట్లాడిన మంత్రి
  • కరోనా మృతదేహాల విషయంలో అపోహలు వద్దని సూచన
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నెల్లూరు జిల్లాలో కరోనా పరిస్థితులను సమీక్షించారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ నుంచి జూమ్ యాప్ ద్వారా క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగుల మృతదేహాలను ఖననం చేసే విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు.

అయితే, కరోనా రోగి మృతదేహంపై 6 గంటల తర్వాత ఎలాంటి వైరస్ ఉండదని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు అనేక వైద్య సంస్థలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. కరోనా రోగి దురదృష్టం కొద్దీ మరణించిన పక్షంలో నిర్భయంగా అంతిమ సంస్కారం నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా రోగుల మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.


More Telugu News