మోదీతో కలిసి అయోధ్య రామాలయ భూమిపూజలో పాల్గొన్న నృత్యగోపాల్ దాస్‌కు కరోనా
- భూమిపూజ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించిన దాస్
- మోదీతో పాటు పలువురితో వేదికను పంచుకున్న నృత్యగోపాల్
- ప్రస్తుతం మథురలో స్వామీజీ
ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అయోధ్య రామాలయ భూమిపూజలో పాల్గొన్న రామజన్మభూమి ట్రస్ట్ సారథి నృత్యగోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల జరిగిన భూమిపూజ కార్యక్రమాలను ఆయనే దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించిన విషయం తెలిసిందే. మోదీతో కలిసి ఆయన వేదికను పంచుకున్నారు. కృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా నృత్యగోపాల్ దాస్ ప్రస్తుతంలో మథురలో ఉంటున్నారు.
ఆరోగ్య సమస్యలు రావడంతో ఆయనకు వైద్యులు కరోనాతో పాటు పలు పరీక్షలు చేశారు. దీంతో ఆయనకు కొవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. నృత్యగోపాల్ దాస్‌కు కరోనా సోకిన విషయాన్ని తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే మథుర డీఎంతో మాట్లాడినట్లు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
రామాలయ భూమిపూజ కార్యక్రమంలో ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందిబెన్‌తో పాటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురు వేదికపై కనపడ్డారు. కాగా, భూమిపూజకు ముందు కూడా ఆలయ పూజారి ప్రదీప్‌దాస్‌తో పాటు మరికొందరు పోలీసు సిబ్బందికి కరోనా సోకిన సంగతి విదితమే.