త్రివర్ణ పతాకాన్ని పోలిన మాస్కుల విక్రయం.. గోవా మాజీ సీఎం ఆగ్రహం
- అశోకచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని పోలిన మాస్కులు
- మార్కెట్లో లభ్యమవుతుండడం పట్ల అభ్యంతరాలు
- చాలా బాధపడ్డానన్న గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్
- త్రివర్ణ పతాకాన్ని గౌరవిద్దామని పిలుపు
కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నో రకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. చూడగానే ఆకట్టుకునేలా మాస్కులపై కూడా వెరైటీ డిజైన్లు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశోకచక్రంతో కూడిన త్రివర్ణ పతాకాన్ని పోలిన మాస్కులు కూడా మార్కెట్లో లభ్యమవుతుండడం పట్ల పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ జెండాను పోలిన మాస్కులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మాస్కులను నిషేధించాలని గోవా మాజీ సీఎం దిగంబర్ కామత్ కూడా డిమాండ్ చేశారు. జాతీయ జెండాలను పోలి ఉన్న మాస్కులను చూసి తాను చాలా బాధపడ్డానని చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జాతీయజెండాను పోలిన మాస్కులు లభ్యమవుతుండడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటివి విక్రయించకుండా అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. త్రివర్ణ పతాకాన్ని గౌరవిద్దామని ఆయన పిలుపునిచ్చారు.