టీకా ఎక్కడ వచ్చినా రాష్ట్రాలు స్వయంగా కొనవద్దు: కేంద్రం సూచన
- స్వీయ మార్గాల ద్వారా తెప్పించుకోవద్దు
- వ్యాక్సిన్ పై అన్ని అంశాలనూ నిర్ణయిస్తాం
- నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశం
ప్రపంచంలో ఏ దేశంలో వ్యాక్సిన్ విడుదలైనా, రాష్ట్రాలు, తమ స్వీయ మార్గాల ద్వారా దాన్ని తెప్పించుకునే ప్రయత్నాలు చేయవద్దని కేంద్రం, అన్ని రాష్ట్రాలకూ సూచించింది. నిన్న నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సమావేశమైన కమిటీ, వ్యాక్సిన్ పంపిణీ విధానం, నిర్వహణ తదితర అంశాలపై కీలక చర్చలు జరిపింది.
వ్యాక్సిన్ లభ్యత, సరఫరా విధానం, దాన్ని చేరవేయడంలో తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అందుబాటులోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై జాతీయ సాంకేతిక సలహా బృందం వివరాలను నీతి ఆయోగ్ అడిగి తెలుసుకుంది. వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ట్రాక్ చేసేందుకు అందుబాటులోని వ్యవస్థలపైనా ఈ కమిటీ చర్చలు జరిపింది. వ్యాక్సిన్ ల సేకరణ, దాన్ని ప్రజలకు చేరవేసేందుకు మార్గదర్శకాలపై దృష్టిని సారించిన కమిటీ, దీని భద్రత, నిఘా తదితరాలపైనా చర్చించింది. కేంద్రం తరఫునే వ్యాక్సిన్ ఎంపికను చేయాలని, రాష్ట్రాలు తమ మార్గాల్లో దీన్ని సమీకరించే ప్రయత్నాలు చేయవద్దని కోరింది.