మహిళను జోబిడెన్ ఎంపిక చేయడాన్ని పురుషులు అవమానంగా భావించవచ్చు: ట్రంప్
- కమల హ్యారిస్ ను డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన బిడెన్
- బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకి అయిపోయారన్న ట్రంప్
- కొందరు మెచ్చుకునే అవకాశం కూడా ఉందని వ్యాఖ్య
అమెరికా అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నికలు జరగనుండటంతో ఆ దేశంలో రాజకీయవేడి పెరిగింది. డెమోక్రాట్ల తరపున అధ్యక్షుడి ఎన్నికల బరిలోకి దిగిన జోబిడెన్... ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమల హ్యారిస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా బిడెన్ ఎంచుకున్నారని... ఈ నిర్ణయాన్ని ఆయన పార్టీలోని కొందరు పురుషులు అవమానంగా భావించే అవకాశం ఉందని చెప్పారు.
ఈ నిర్ణయంతో బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకిగా మారిపోయారని అన్నారు. పురుషులకు అవమానం జరిగిందని కొందరు అనొచ్చని... బిడెన్ సరైన నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అనొచ్చని ట్రంప్ చెప్పారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.