ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి
- కొన్నిరోజులుగా కరోనాతో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి
- హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స
- ఈ మధ్యాహ్నం కన్నుమూత
కరోనా రక్కసి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనా వైరస్ కు బలయ్యారు. గత కొన్నిరోజులుగా ఈ మహమ్మారితో పోరాడుతున్న శ్రీకాంత్ రెడ్డి హైదరాబాదు యశోదా ఆసుపత్రిలో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన గతంలో కడప లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.