గంగూలీని ఆకాశానికి ఎత్తేసిన షోయబ్ అఖ్తర్
- ప్రత్యర్థులను కట్టడి చేయడాన్ని నేను ఇష్టపడతా
- గంగూలీని ఎదుర్కోవడం మాత్రం ఇబ్బందిగా అనిపించేది
- గంగూలీ గొప్ప నాయకుడు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఇన్స్టాగ్రామ్ లో గంగూలీతో కలిసున్న ఫొటోను అఖ్తర్ షేర్ చేశాడు. అన్ని రకాల వ్యతిరేకతను తను స్వాగతించానని, అందుకే ఏ జట్టుతోనైనా పోటీ పడేందుకు తాను రెడీగా ఉండేవాడినని షోయబ్ చెప్పాడు. ప్రత్యర్థులను కట్టడి చేయడాన్ని తాను చాలా ఇష్టపడతానని తెలిపాడు. అయితే గంగూలీని ఎదుర్కోవడం మాత్రం తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని చెప్పాడు. గంగూలీ ఒక గొప్ప ప్రత్యర్థి మాత్రమే కాదని... గొప్ప నాయకుడు కూడా అని తెలిపాడు. గతంలో ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు తాను గంగూలీ నాయకత్వంలోనే ఆడానని గుర్తు చేశాడు.