అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతి సెనేటర్ కమల హారిస్ ఎంపికపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు

  • ఆమె ఓ భయంకరమైన మహిళ 
  • ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ
  • ఆ సమయంలో ఆమె బలహీనత తెలిసింది
  • సెనేట్‌లో అంతటి అగౌరవనీయమైన వ్యక్తి ఎవరూ లేరు
భారతీయ మూలాలున్న సెనేటర్ కమలా హారిస్‌ను అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ భయంకరమైన మహిళ అని వ్యాఖ్యానించారు.  ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడే ఆమె అసమర్థత వల్ల తనను ఆకట్టుకోలేదని, ఆమె బలహీనతలను చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.

సెనేట్‌లో ఆమె అంతటి అగౌరవనీయమైన వ్యక్తి మరెవరూ లేరని ట్రంప్ వ్యాఖ్యానించారు. అటువంటి మహిళను జో బిడెన్ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. జాత్యహంకార విధానాలకు జో బిడెన్ మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.


More Telugu News