తనపై అభ్యంతరకర పోస్టులపై.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
- ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డిపై ఫిర్యాదు
- సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారు
- నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపై పోస్టులు
- విచారణ జరపకపోతే పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఐఅండ్‌పీఆర్‌లో చీఫ్ డిజిటల్ డైరెక్టర్ దేవేందర్‌రెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆయన పోస్టు చేశారని రఘురామకృష్ణ రాజు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎంపీపై పోస్టులు చేయడమేంటని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఆ పోస్టులపై స్పందించి, వెంటనే విచారణ జరిపించి దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు, దీనిపై విచారణ జరిపించే అంశంలో జాప్యం చేస్తే తాను పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.