వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం.. ఒక్క క్లిక్‌తో మహిళల ఖాతాల్లో రూ.18,750

  • 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే వారి కోసం పథకం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు డబ్బులు
  • ఏపీ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,700 కోట్ల కేటాయింపు
  • 25 లక్షల మంది మహిళలకు లబ్ధి
ఆంధ్రప్రదేశ్‌లో 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున అందించే వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటి విడత సాయంగా బటన్‌ నొక్కి నేరుగా మహిళల ఖాతాల్లోకి రూ.18,750 చొప్పున పంపారు.

ఈ పథకం కోసం రాష్ట్ర  బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.4,700 కోట్లను కేటాయించింది. ఈ పథకం ద్వారా దాదాపు 25 లక్షల మంది మహిళలు లబ్ధిపొందుతారు. మహిళల సాధికారిత కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అమూల్, ఐటీసీ, హెచ్‌యూఎల్ వంటి పలు సంస్థలతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మహిళలు వ్యాపారస్తులుగా ఎదగడానికి అవసరమైన టెక్నాలజీ, మార్కెటింగ్‌ సాయాన్ని ఈ సంస్థలు మహిళలకు అందించనున్నాయి.


More Telugu News