జగన్ గారూ.. మీ సలహాదారుల మాట కాకుండా.. నేను చెప్పేది వినండి: వర్ల రామయ్య

  • దళిత వ్యతిరేకి అనే ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకోండి
  • శిరోముండన కేసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయండి
  • మీ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడుకోండి
తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మానవతా విలువలను మంటకలిపేలా పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను మావోయిస్టుల్లో కలిసిపోయేందుకు అనుమతించాలంటూ రాష్ట్రపతికి బాధిత దళిత యువకుడు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి గారూ... మీ ప్రభుత్వంపై దళిత వ్యతిరేకి అనే ముద్ర పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వర్ల సూచించారు. శిరోముండన కేసులో అసలు ముద్దాయిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మీ సలహాదారుల మాటలు వినకండని చెప్పారు. తన సలహాలు మాత్రమే విని... అసలు  ముద్దాయిని అరెస్ట్ చేసి, మీ ప్రభుత్వ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. లేనిపక్షంలో దళిత ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు.


More Telugu News