కరోనా కేసుల్లో ప్రపంచంలో ఏపీ ఘనత ఇలా ఉంది: దేవినేని ఉమ విమర్శలు
- కేసులు రెండున్నర లక్షలకు చేరుకుంటున్నాయి
- మరణాలు 2,200 దాటాయి
- దేశంలో వందకు పదిమంది ఆంధ్రులే
- దేశంలో వైరస్ ఉద్ధృతి జిల్లాలు 22 ఉంటే 13 ఏపీవే
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో వైసీపీ సర్కారుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'కేసులు రెండున్నర లక్షలకు చేరుకుంటున్నాయి, మరణాలు 2,200 దాటాయి. ప్రపంచంలో ఏపీ ఘనత. దేశంలో వందకు పదిమంది ఆంధ్రులే, దేశంలో వైరస్ ఉద్ధృతి జిల్లాలు 22 ఉంటే 13 ఏపీవే' అని ఆయన విమర్శలు గుప్పించారు.
'15 రోజుల్లో దేశంలో పెరుగుదల 0.42%, ఏపీలో 50%. ఏపీలో కరోనా అదుపుతప్పిందన్న కొవిడ్ ఇండియా వెబ్ సైట్ హెచ్చరిక మీకు కనపడుతుందా జగన్ గారు?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన వార్తలను పోస్ట్ చేశారు. జిల్లాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అందులో పేర్కొన్నారు.