పోలీసులతో గొడవపడిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య!
- గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
- మాస్క్ లేకుండా బయటకు వచ్చిన రివాబా జడేజా
- ఆపిన మహిళా కానిస్టేబుల్ తో వాగ్వాదం
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్, రవీంద్ర జడేజా భార్య రివాబా, పోలీసులతో గొడవపడి వార్తల్లోకి ఎక్కారు. గుజరాత్, రాజ్ కోట్ లో ఈ ఘటన జరిగింది. నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనోహర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రాగా, ఓ కానిస్టేబుల్ ఆపి ప్రశ్నించాడు. సోమవారం రాత్రి, రివాబా బయటకు వచ్చారు. ఆమె కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించిన కానిస్టేబుల్ సోనాల్ గోసాయి, ఆమెను కిసాన్ పురా చౌక్ ప్రాంతంలో ఆపారు.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రివాబా, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రివాబా జడేజా, మాస్క్ ధరించకపోవడమే ఈ వాగ్వాదానికి కారణమని తమ ప్రాథమిక విచారణలో తేలిందని మనోహర్ సింగ్ తెలియజేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని అన్నారు. ఈ వాగ్వాదం తరువాత కానిస్టేబుల్ సోనాల్ గోసాయి, స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కొద్ది గంటల తరువాత ఆమె కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారని వెల్లడించారు. కాగా, ఈ గొడవపై ఇంతవరకూ ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని తెలుస్తోంది.