ఓ పెయింటింగ్ ను చూసి భయపడి మంత్రాలు చదివిన సుశాంత్ సింగ్... ఈడీ ఎదుట రియా చక్రవర్తి

  • సుశాంత్ సింగ్ సున్నిత మనస్కుడు
  •  'సాటర్న్ డెవోరింగ్ హిస్ ఓన్ సన్' చూసి భయపడ్డాడు
  • ఓ హోటల్ లో చిత్రాన్ని చూసి భయపడ్డాడన్న రియా
ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంతో భయస్తుడని, సున్నిత మనసు కలవాడని చెబుతూ, అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట వాంగ్మూలం ఇస్తూ, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. స్పెయిన్ కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు ప్రాన్సిస్కో గోయా చేతినుంచి జాలువారిన 'సాటర్న్ డెవోరింగ్ హిస్ ఓన్ సన్' అనే పేరున్న చిత్రాన్ని చూసి, సుశాంత్ ఎంతగానో భయపడ్డాడని వ్యాఖ్యానించింది.

ఈ ఘటన ఓ హోటల్ లో జరిగిందని రియా చక్రవర్తి అధికారులకు వివరించింది. ఆ సమయంలో తాను తన సోదరుడితో కలిసి మరో గదిలో ఉన్నానని తెలిపింది. సుశాంత్ గదికి తాను వెళ్లేసరికి భయంతో వణికిపోతూ మంత్రాలు జపిస్తూ కనిపించాడని తెలిపింది. కాగా, తన కడుపున పుట్టిన ఓ కొడుకు తనను సింహాసనం నుంచి దూరం చేస్తాడని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో, ఆ భయంతో, తనకు కొడుకులు పుట్టీపుట్టగానే వాళ్లను పీక్కుతినే సాటర్న్ రాజు చిత్రంగా 'సాటర్న్ డెవోరింగ్ హిస్ ఓన్ సన్' చిత్రరాజం నిలిచింది.


More Telugu News