ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తివేత
- గంటగంటకూ పెరుగుతున్న వరద
- 175 గేట్లను ఎత్తివేసిన అధికారులు
- 2.25 లక్షల క్యూసెక్కుల వరద సముద్రంలోకి
గోదావరి నదిలో గంటగంటకూ వరద పెరుగుతూ ఉండటంతో, రాజమండ్రి సమీపంలోని వద్ద ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. వరద ప్రభావం స్థిరంగా కొనసాగుతూ ఉండటంతో నీటిమట్టం 10.15 అడుగులకు చేరుకుంది. దీంతో 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో పంట కాలువలకు కూడా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వ్యవసాయ, తాగునీటి అవసరాల నిమిత్తం 12,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు వెల్లడించారు.