వర్షాకాలం ముగిసే వరకు కోజికోడ్‌లో భారీ విమాన రాకపోకలపై నిషేధం

వర్షాకాలం ముగిసే వరకు కోజికోడ్‌లో భారీ విమాన రాకపోకలపై నిషేధం
  • ఈ నెల 7న రాత్రి ల్యాండ్ అవుతూ ప్రమాదానికి గురైన విమానం
  • పైలట్, కోపైలట్ సహా 20 మంది మృతి
  • అధిక వేగమే ప్రమాదానికి కారణమంటున్న నిపుణులు
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఈ వర్షాకాలం ముగిసే వరకు విమాన రాకపోకలను నిషేధిస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా ఈ నెల 7న రాత్రి దాదాపు 8 గంటల సమయంలో 191 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అవుతూ పక్కనే ఉన్న లోయలోకి జారిపోయింది.

వర్షాల కారణంగా రన్‌వే చిత్తడిగా ఉండడంతో జారి లోయలోకి దూసుకెళ్లి రెండు ముక్కలైంది. ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వర్షాకాలం ముగిసే వరకు ఈ విమానాశ్రయంలో విమాన రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, విమానం నిర్ధారిత వేగానికి మించిన వేగంతో ల్యాండ్ కావడమే ప్రమాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News