కుమార్తెకు ఆస్తి హక్కుపై సుప్రీంకోర్టు తీర్పు సంతోషకరం: చంద్రబాబు

  • ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు సమాన హక్కు ఉంటుందని సుప్రీం తీర్పు
  • హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
  • ఆడబిడ్డలకు సమాన హక్కులు ఉండాలని 40 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ ఆకాంక్షించారు
తల్లిదండ్రుల ఆస్తిలో కుమారుడితో పాటు కుమార్తెకు కూడా సమాన హక్కు ఉంటుందంటూ ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 ప్రకారం అప్పటికే తండ్రి మరణించినప్పటికీ ఆస్తిలో కుమార్తెకు సమానహక్కు ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

కుమారుడితో పాటు కుమార్తెకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడం సంతోషకర విషయమని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆడ బిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని నాలుగు దశాబ్దాల క్రితమే ఎన్టీఆర్ గారు ఆకాంక్షించి, అమలు చేశారని చెప్పారు. రాజకీయాల్లో, చట్ట సభల్లో, ఉద్యోగాల్లో ఆడపడుచుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశం పార్టీనే అని తెలిపారు. స్వయం సహాయ బృందాలను ఏర్పాటు చేసి మహిళా శక్తిని చాటింది కూడా టీడీపీనే అని చెప్పారు.


More Telugu News