జగన్ వల్ల రాయలసీమ ప్రాజెక్టులకు చెడ్డపేరు వస్తోంది: కాల్వ శ్రీనివాసులు

  • ప్రచార యావతో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు
  • జగన్ విధానాలు రాయలసీమకు కీడు తెచ్చేలా ఉన్నాయి
  • వ్యక్తిగత స్వార్థం కోసం సీమకు కీడు చేస్తున్నారు
ఏపీ  ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. గత 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ రాని పరిశ్రమలు, ఎప్పుడూ రాని నీళ్లు చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాకు వచ్చాయని చెప్పారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు రాబట్టే... కియా కార్ల పరిశ్రమ వచ్చిందని తెలిపారు. కర్నూలు జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మెగా సోలార్ పార్క్, భారీ విత్తన ఉత్పత్తి  కేంద్రం వచ్చాయని చెప్పారు. రూ. 590 కోట్లతో ముచ్చుమర్రి ప్రాజెక్టును టీడీపీ హయాంలో నిర్మించామని... దీని వల్ల కర్నూలు జిల్లాకు నీటి కొరత తీరిందని అన్నారు.

జగన్ మాత్రం ప్రచారం పిచ్చితో రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారని శ్రీనివాసులు మండిపడ్డారు. అపెక్స్ కౌన్సిల్ లో, కేఆర్ఎంబీలో ఏపీకి కీడు చేసేలా జగన్ విధానాలు ఉన్నాయని విమర్శించారు. రాయలసీమకు చేటు తెచ్చేలా ఉన్నాయని దుయ్యబట్టారు. వ్యక్తిగత స్వార్థం కోసం రాయలసీమకు ద్రోహం చేస్తున్న జగన్ ను సీమప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నిలదీయాలని అన్నారు.


More Telugu News