24 గంటల్లో చర్యలు తీసుకుంటామని గొప్పగా చెప్పారు.. 25 రోజులు గడిచింది: టీడీపీ నేత గొల్లపల్లి

  • తూర్పుగోదావరి జిల్లాలో దళితుడికి శిరోముండనం చేసిన పోలీసులు
  • మావోయిస్టుల్లో చేరుతానంటూ రాష్ట్రపతికి లేఖ రాసిన బాధితుడు
  • దళితులపై దాడులు పెరుగుతున్నాయన్న గొల్లపల్లి
తూర్పుగోదావరి జిల్లాలో ఓ దళిత యువకుడు వరప్రసాద్ కు పోలీసులు శిరోముండనం చేయించిన ఘటన వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాశాడు. రాజ్యాంగం తనను రక్షించదనే విషయం తనకు అర్థమైందని ... మావోయిస్టుల్లో చేరేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని లేఖలో రాష్ట్రపతిని కోరాడు. ఈ విషయంపై మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపూడి సూర్యారావు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

నిందితులపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి విశ్వరూప్ చెప్పారని... ఘటన జరిగి 25 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. వరప్రసాద్ దుందుడుకు నిర్ణయం తీసుకోకూడదని... మనోధైర్యంతో ఉండాలని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని... ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు అంబేద్కర్ విగ్రహాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.


More Telugu News