ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకున్నాను.. ఈ కాలంలో ఎన్నో మార్పులు: వెంకయ్య నాయుడు
- మూడేళ్లలో రాజ్యసభ చాలా మారింది
- పనిచేసే సమయం పెరిగింది
- కీలక బిల్లులు ఆమోదం పొందాయి
- గత ఆరు నెలలు కరోనాతో గడిచిపోయాయి
ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని వెంకయ్య నాయుడు అన్నారు. మూడేళ్లలో రాజ్యసభ చాలా మారిందని, పనిచేసే సమయం పెరిగిందని తెలిపారు. ఆయన ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మూడేళ్లలో ఎదురైన అంశాలపై ఆయన 'కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్' పేరుతో ఓ పుస్తకాన్ని రాశారు.
దీన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... తన మూడేళ్ల పదవీ కాలంలో దేశంలో కీలక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. తాను మొదటి నుంచీ వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నానని చెప్పారు. రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు.
దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోందని, మహమ్మారి నుంచి కాపాడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వెంకయ్య నాయుడు చెప్పారు. కరోనా నివారణ కోసం అన్ని రంగాల వారు కృషి చేస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లోనూ విసృతంగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. గత ఆరు నెలలు కరోనాతో గడిచిపోయాయని చెప్పారు.