వైట్ హౌస్ వద్ద కాల్పులతో సగంలోనే ఆగిన ట్రంప్ మీడియా సమావేశం... చుట్టుముట్టి తీసుకెళ్లిపోయిన ఎస్కార్ట్స్!
- ఓ వ్యక్తిని కాల్చిన సీక్రెట్ సర్వీస్ ఏజంట్
- వెంటనే అప్రమత్తమైన ట్రంప్ సెక్యూరిటీ
- ఆయుధాలు కలిగుండటంతోనే ఘటన జరిగిందని వివరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతున్న వేళ, అక్కడికి సమీపంలోనే ఓ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు ఎన్ కౌంటర్ చేయడంతో తన సమావేశాన్ని ఆయన మధ్యలోనే ముగించాల్సి వచ్చింది. కాల్పుల ఘటన తెలియగానే ఎస్కార్ట్స్ బృందం, ట్రంప్ ను చుట్టుముట్టి, అక్కడి నుంచి తీసుకెళ్లింది.
కాగా, జరిగిన ఘటనపై వాషింగ్టన్ డీసీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి డౌగ్ బుచానన్ వివరణ ఇస్తూ, "సోమవారం సాయంత్రం 5.55 గంటల సమయంలో సీక్రెట్ సర్వీస్ విభాగం నుంచి ఓ ఫోన్ వచ్చింది. సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఓ వ్యక్తిని శరీరం పైభాగంలో కాల్చాల్సి వచ్చిందని చెప్పారు. ఆ వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాం" అని అన్నారు.
మొత్తం ఘటనపై తదుపరి ట్రంప్ కూడా వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తి వద్ద ఆయుధం ఉందని, నిషేధిత ప్రదేశంలోకి ఆయుధంతో రావడమే ఈ ఘటనకు దారి తీసిందని స్పష్టం చేశారు. బయట జరిగిన ఘటన గురించి తనకు పూర్తిగా తెలియదని చెప్పారు. అయితే, ఘటన జరిగిన ప్రాంతంలో ఎటువంటి ఆయుధాలనూ రికవరీ చేయలేదని విచారణ అధికారి ఒకరు చెప్పడం గమనార్హం. ఇక ఈ కాల్పులపై స్పందించేందుకు సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి జూలియా మెక్ ముర్రే తిరస్కరించారు.