సెప్టెంబరు 30 వరకు అన్ని సాధారణ రైళ్లూ బంద్.. రైల్వే శాఖ

  • అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ
  •  రేపటితో ముగియనున్న జూన్ 25 నాటి ఆదేశాల గడువు
  • ప్రత్యేక రైళ్లు మాత్రం తిరుగుతాయని స్పష్టీకరణ
భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే నెలాఖరు వరకు అన్ని సాధారణ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ రైళ్ల సేవలను సెప్టెంబరు 30 వరకు రద్దు చేస్తున్నట్టు అన్ని జోనల్ రైల్వేలకు నిన్న ఆదేశాలు జారీ చేసింది.

నిజానికి వీటి సేవలను ఈ నెల 12 వరకు రద్దు చేస్తున్నట్టు జూన్ 25న జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. రేపటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే, లాక్‌డౌన్ సమయంలో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ప్రారంభించిన ప్రత్యేక రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర రైళ్ల సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.


More Telugu News