వచ్చే నెల నుంచి ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతుంది: కొవిడ్ కంట్రోల్ రూం స్పెషల్ ఆఫీసర్
- రాష్ట్రంలో 15 శాతానికిపైగా హెర్డ్ ఇమ్యూనిటీ
- ఈ నెల 21 నుంచి కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా తగ్గుముఖం
- మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది
వచ్చే నెల నుంచి ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కొవిడ్ కంట్రోల్ రూం స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో హెర్డ్ ఇమ్యూనిటీ 15 శాతంపైనే ఉందని గుర్తించామని, కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో, వచ్చే నెల 4 నుంచి గుంటూరు, కృష్ణా, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి వివరించారు.