ఎస్వీబీసీ చానల్ సీఈఓగా సురేశ్ కుమార్ నియామకం

  • ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
  • దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న సురేశ్ కుమార్
  • కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసుల్లోకి రాక
టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) సీఈఓగా జి.సురేశ్ కుమార్ ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సురేశ్ కుమార్ ప్రస్తుతం విజయవాడ దూరదర్శన్ కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పై ఆయన రాష్ట్ర సర్వీసుల్లో చేరారు. త్వరలోనే ఎస్వీబీసీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.


More Telugu News