యూఏఈ గడ్డపై ఐపీఎల్ నిర్వహణకు పచ్చజెండా ఊపిన కేంద్రం

  • బీసీసీఐకి అనుమతి మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం
  • సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకు అన్ని అనుమతులు లభించాయి. ప్రధానంగా, కేంద్ర ప్రభుత్వం ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి కీలక అనుమతి మంజూరు చేసింది. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఐపీఎల్ చైర్మన్ బ్రజేశ్ పటేల్ వెల్లడించారు. భారత కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి ఈ మేరకు అనుమతి పత్రం వచ్చిందని వివరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లీగ్ ను భారత్ లో జరిపే వీల్లేకపోవడంతో ఐపీఎల్ వేదిక యూఏఈకి మారిన సంగతి తెలిసిందే. మారిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 19న టోర్నీ ప్రారంభమై, నవంబరు 10న జరిగే ఫైనల్ తో ముగియనుంది. కాగా, టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.


More Telugu News