అనారోగ్యం నుంచి కోలుకున్న సంజయ్ దత్... ఆసుపత్రి నుంచి డిశ్చార్జి
- రెండ్రోజుల కిందట అస్వస్థతకు గురైన సంజయ్ దత్
- ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స
- తనకు కరోనా లేదన్న సంజయ్ దత్
ఇటీవల అస్వస్థతకు గురైన బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కోలుకున్నారు. గత కొన్నిరోజులుగా ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన సంజయ్ దత్ ఇవాళ డిశ్చార్జి అయ్యారు.
రెండ్రోజుల కిందట శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే సంజయ్ దత్ కు కరోనా సోకిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీనిపై సంజయ్ దత్ అప్పుడే వివరణ ఇచ్చారు. తనకు కరోనా లేదని, వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెల్లడించారు.