సెన్సెక్స్ కు వరుసగా మూడో రోజు.. నిఫ్టీకి ఐదో రోజు లాభాలు!
- 142 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 56 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతం వరకు లాభపడ్డ ఎం అండ్ ఎం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ వరుసగా మూడో సెషన్లో కూడా లాభాలను మూటగట్టుకోగా... నిఫ్టీ వరుసగా ఐదో సెషన్లో కూడా లాభపడింది. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి సూచీలు లాభాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్లు లాభపడి 38,182కి చేరుకుంది. నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 11,270 వద్ద సిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.95%), ఎల్ అండ్ టీ (4.84%), సన్ ఫార్మా (3.47%), ఎన్టీపీసీ (3.44%), టెక్ మహీంద్రా (3.17%).
టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-1.17%), మారుతి సుజుకి (-1.16%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.11%), బజాజ్ ఫైనాన్స్ (-0.85%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.84%).