మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా
- ట్విట్టర్ ద్వారా తెలిపిన ప్రణబ్
- ఇటీవల తనను కలిసిన వారూ పరీక్షలు చేయించుకోవాలని సూచన
- వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ప్రణబ్
దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ప్రముఖులు కూడా కొవిడ్-19 బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
వేరే పరీక్షల కోసం తాను ఆసుపత్రికి వెళ్లానని, ఈ సందర్భంగా కరోనా పరీక్ష చేయించుకోగా తనకు వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆయన ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారు కూడా ఐసొలేషన్‌లో ఉండి, పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు ఐసోలేషన్‌లో ఉంటూ ప్రణబ్ ముఖర్జీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.