ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు: నాగబాబు వ్యాఖ్యలు

  • కష్ట సమయంలో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్
  • ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు?
  • ప్రభుత్వాన్ని నిందించే హక్కు డబ్బు తీసుకుని ఓటేసే వారికి లేదు
ఓటర్లపై జనసేన నేత, సినీనటుడు నాగబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండిపోయిన వారిని, డబ్బు తీసుకుని ఓటు వేసిన వారిని విమర్శించారు. 'కష్ట సమయంలో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40 శాతం ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు' అని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు.
 
'రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం  అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు' అని నాగబాబు మరో ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు.


More Telugu News