ఐర్లాండ్ నుంచి వచ్చిన అలెర్ట్ ఫోన్... ఆత్మహత్యకు సిద్ధమైన యువకుడిని కాపాడిన ముంబై పోలీసులు!
- ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టిన యువకుడు
- దాన్ని చూసి స్పందించిన ఐర్లాండ్ అధికారి
- ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్న సైబర్ సెల్
ఐర్లాండ్ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాల్, ముంబైలో ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ యువకుడి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళితే, ముంబైలో వంటవాడిగా పనిచేస్తున్న ఓ ఢిల్లీ యువకుడు, తాను జీవితంపై విరక్తి చెందానని, ఆత్మహత్య చేసుకోనున్నానని ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఆ వెంటనే ఈ పోస్ట్ ఐర్లాండ్ లో ఫేస్ బుక్ లో పనిచేస్తున్న ఓ అధికారి కంట కనపడింది. వెంటనే స్పందించిన అతను, ఢిల్లీ పోలీసులకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు. అదే విషయాన్ని మెయిల్ ద్వారానూ తెలియజేశారు.
వెంటనే రంగంలోకి దిగిన సైబర్ సెల్ అధికారులు, టెక్నాలజీ సాయంతో ఆ యువకుడి ఫేస్ బుక్ ఖాతాను ట్రేస్ చేసి, ఫోన్ నంబర్ ను కనిపెట్టారు. అతను ముంబైలో ఉన్నాడని పసిగట్టి, అక్కడి పోలీసులకు విషయాన్ని చేరవేశారు. ఆ వెంటనే అతనున్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని, ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని సైబర్ సెల్ డీసీపీ అనేశ్ రాయ్ తెలియజేశారు.