శ్మశానం నుంచి ఏడుపు... శిశువును వెలికితీసిన గ్రామస్థులు!

  • ఝార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలో ఘటన
  • పిల్లాడి ఏడుపు విని గ్రామస్తులకు చెప్పిన వ్యక్తి
  • బాలుడిని వెలికి తీసిన యువకులు
బతికున్న శిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పైపైన పాతిపెట్టి వెళ్లిపోగా, ఆ బాలుడు ఏడుస్తూ, తన ఉనికిని బహిర్గతం చేసిన వింతైన ఘటన ఝార్ఖండ్ లోని లోహర్ దగా జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, కుడు పోలీసు స్టేషన్ ప్రాంతంలోని ఓ శ్మశానం వద్ద గడ్డి కోసుకునేందుకు వెళ్లిన ఓ మహిళకు శిశువు ఏడుపు వినిపించింది. పరిశీలించి చూడగా, పైపైన కప్పెట్టిన ఓ ప్రదేశంలో శిశువు ఏడుపు వినిపించింది.  

ఈ విషయాన్ని ఆమె వెంటనే ఊరి ప్రజలకు తెలియజేసింది. అందరూ అక్కడికి వచ్చి, ఏడుపు వినిపిస్తున్న ప్రాంతంలో వెలికితీయగా, అప్పుడే పుట్టిన ఓ శిశువు కనిపించాడు. ఆ పిల్లాడు క్షేమంగానే ఉన్నాడని గుర్తించిన స్థానికులు అతనికి ఒక మహిళ వద్ద తల్లి పాలు పట్టించారు. ఈ పిల్లాడిని పెంచుకుంటామంటూ పలువురు దత్తత తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఈలోగా విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, అక్కడికి వచ్చి, శిశువును ఆసుపత్రికి తరలించి, అతని తల్లిదండ్రులు ఎవరన్న విషయంపైనా, ఎవరు పాతిపెట్టారన్న విషయంపైనా దర్యాఫ్తు మొదలు పెట్టారు.


More Telugu News