టిక్ టాక్ ను చేజిక్కించుకునేందుకు ట్విట్టర్ యత్నం!
- ఇప్పటికే టిక్ టాక్ కోసం ప్రయత్నిస్తున్న మైక్రోసాఫ్ట్
- సెప్టెంబరు 15 నాటికి చర్చలు పూర్తవుతాయని వెల్లడి
- ట్విట్టర్ రంగంలోకి దిగిందంటూ 'బ్లూంబెర్గ్' కథనం
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను చేజిక్కించుకునేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ మీడియా సంస్థ 'బ్లూంబెర్గ్' ఆసక్తికర కథనం వెలువరించింది. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ కూడా టిక్ టాక్ ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆ కథనంలో పేర్కొన్నారు. ట్విట్టర్ భారీ విలీనానికి సన్నద్ధమవుతోందని, చైనా సంస్థ బైట్ డ్యాన్స్ కు చెందిన టిక్ టాక్ ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతోందని వివరించింది.
అయితే, మైక్రోసాఫ్ట్ వంటి ట్రిలియన్ డాలర్ల దిగ్గజాన్ని కాదని, 29 బిలియన్ డాలర్ల విలువైన ట్విట్టర్ ఏ విధంగా టిక్ టాక్ ను టేకోవర్ చేస్తుందన్న సందేహాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఓవైపు సెప్టెంబరు 15 నాటికి టిక్ టాక్ తో తమ సంప్రదింపులు, చర్చలు పూర్తవుతాయని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ కోసం ట్విట్టర్ ప్రయత్నిస్తోందన్న 'బ్లూంబెర్గ్' కథనం ఆసక్తి కలిగిస్తోంది.