విశాఖలో మరోసారి కలకలం... పోర్టులో ఆగివున్న నౌకలో అగ్నిప్రమాదం!

  • చెన్నై నుంచి విశాఖ వచ్చిన పనామా బీడీ-51 నౌక
  • ఇంజిన్ రూం నుంచి పొగలు
  • వెంటనే స్పందించి మంటలు ఆర్పివేసిన సిబ్బంది
చెన్నై నుంచి విశాఖ వచ్చిన ఓ నౌక అగ్నిప్రమాదానికి గురైంది. పనాబా బీడీ-51 అనే ఈ నౌక వెస్ట్ క్యూ-5 బెర్తులో ఆగివుండగా, ఇంజిన్ క్యాబిన్ రూం నుంచి ఒక్కసారిగా పొగలు రావడం మొదలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది ఇంజిన్ రూంలో చెలరేగిన మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని విశాఖ పోర్టు అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం స్వల్పమైనదేనని, ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.


More Telugu News