సుశాంత్ కు గుర్తింపునిచ్చింది ముంబయి... బీహార్ కాదు: శివసేన వ్యాఖ్యలు
- సుశాంత్ కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన బీహార్
- ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్న శివసేన
- ఈ కేసులో మరో రాష్ట్రం జోక్యం ఏంటని ఆగ్రహం
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుగా మారింది. సుశాంత్ ఆత్మహత్య ఉదంతంపై సీబీఐ దర్యాప్తుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదేశించడాన్ని మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో బీహార్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అధికార పక్షం శివసేన తన అధికార పత్రిక 'సామ్నా'లో పేర్కొంది.
గత కొన్నేళ్లుగా సుశాంత్ ముంబయి వాసిగా కొనసాగుతున్నాడని, అతడికి తగిన గుర్తింపును ఇచ్చింది ముంబయి నగరమేనని తెలిపింది. అతడు కష్టాల్లో ఉన్న సమయంలో బీహార్ కనీసం అతడికి మద్దతుగా కూడా నిలవలేకపోయిందని శివసేన విమర్శించింది.
"బీహార్ పోలీసులేమీ ఇంటర్ పోల్ విభాగం కాదు. ఈ కేసులో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మరో రాష్ట్రం జోక్యం చేసుకోరాదు. నిజం తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఈ నిజాన్ని సీబీఐ అధికారులో, లేక బీహార్ పోలీసులు మాత్రమే వెలికితీస్తారని అనుకోవవద్దు" అంటూ శివసేన 'సామ్నా'లో వ్యాఖ్యానించింది.