అడవిబిడ్డలకు భూమి హక్కు పత్రాల పంపిణీ అక్టోబరు 2కి వాయిదా: సీఎం జగన్

  • నేడు ఆదివాసీల దినోత్సవం
  • గిరిజన జాతులకు ఏపీ అందమైన పొదరిల్లు అన్న జగన్
  • గాంధీ జయంతి సందర్భంగా అనేక శంకుస్థాపనలు
ఆదివాసీ ప్రజల దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభిన్న ఆదివాసీ తెగలకు అందమైన పొదరిల్లు వంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గిరిజన వారసత్వం పట్ల గర్విస్తున్నామని, గిరిజన జాతులను, వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు, అభివృద్ధి చేసేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే, ఆదివాసీలకు ప్రభుత్వం చేయదలిచిన భూమి హక్కు పత్రాల (ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు) పంపిణీ కరోనా వ్యాప్తి కారణంగా అక్టోబరు 2కు వాయిదా వేశామని సీఎం జగన్ వెల్లడించారు.

గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన చేస్తున్నామని, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన యూనివర్సిటీకి భూమి పూజ జరుగుతుందని వివరించారు. అదే రోజున ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు.


More Telugu News