ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి 'వివో' వైదొలిగినా నో ప్రాబ్లం: గంగూలీ

  • బోర్డు ఆర్థికంగా నష్టాల్లోకి జారుకోబోదు
  • పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం
  • ఇదొక తాత్కాలిక సమస్య మాత్రమే
ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి 'వివో' సంస్థ వైదొలగడంతో మరో స్పాన్సరర్‌ కోసం బీసీసీఐ ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. దీనిపై  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ పలు విషయాలు తెలిపారు.స్పాన్సర్‌షిప్‌ నుంచి 'వివో' సంస్థ వైదొలిగినంత మాత్రాన బోర్డు ఆర్థికంగా నష్టాల్లోకి జారుకోబోదని అన్నారు.

ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదొక తాత్కాలిక సమస్య మాత్రమేనని చెప్పారు. కొద్ది కాలం ధైర్యంగా ముందుకు వెళ్లాలని, గొప్ప కార్యక్రమాలు వెనువెంటనే జరిగిపోవని తెలిపారు. పలు నిర్ణయాలు నష్టాలను, మరికొన్ని నిర్ణయాలు లాభాలను తీసుకొస్తాయని తెలిపారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలని, బీసీసీఐ బలమైన బోర్డని ఆయన అన్నారు. గత పాలకులు, భారత క్రికెట్ ఆటగాళ్లు బీసీసీఐకు ఎంతో బలాన్ని తెచ్చిపెట్టారని చెప్పారు.


More Telugu News