ప్రేమించిన టిక్ టాక్ స్టార్ ను పెళ్లాడనున్న యజువేంద్ర చాహాల్!
- టిక్ టాక్ మాధ్యమంగా ధనశ్రీతో పరిచయం
- వివాహానికి అంగీకరించిన రెండు కుటుంబాలు
- నిశ్చితార్థం జరిగిపోయిందన్న చాహాల్
తాను ఇష్టపడిన ధనశ్రీ వర్మను పెళ్లాడాలని భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహాల్ మనువాడనున్నాడు. సోషల్ మీడియాలో కంటెంట్ ను క్రియేట్ చేయడం ద్వారా సెలబ్రిటీగా మారిన ధనశ్రీ వర్మతో చాహాల్ పరిచయం ప్రేమగా మారింది. యూ ట్యూబర్, కొరియో గ్రాఫర్ అయిన ధనశ్రీ, తన పేరిట ఓ కంపెనీ పెట్టుకుని, తీసే వీడియోలను టిక్ టాక్ లో పెడుతూ, పేరు తెచ్చుకుంది.
చాహాల్ సైతం తరచూ టిక్ టాక్ లో వీడియోలు పెడుతూ ఉంటారన్న సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరి మధ్యా ప్రేమ పుట్టింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలూ అంగీకారం తెలిపారని, ధనశ్రీతో తన నిశ్చితార్థం జరిగిందని చాహాల్ వెల్లడించాడు. అంతకుముందే చాహాల్ తనకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియోను ధనశ్రీ పోస్ట్ చేయడంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. కాగా, ఇప్పటివరకూ ఇండియా తరఫున 52 వన్డేలు, 42 టీ 20లు ఆడిన చాహాల్, త్వరలో యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడన్న సంగతి తెలిసిందే.