కోజికోడ్ విమానాశ్రయానికి ఏడాది కిందటే నోటీసులు జారీ చేసిన డీజీసీఏ!
- గతరాత్రి కోజికోడ్ లో దుర్ఘటన
- విమాన ప్రమాదంలో 17 మంది మృతి
- రన్ వే లోపభూయిష్టం అంటూ వాదనలు!
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం వద్ద జరిగిన విమాన ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు సహా 17 మంది దుర్మరణం చెందడం తెలిసిందే. టేబుల్ టాప్ తరహా విమానాశ్రయం అయినందువల్లే ఇక్కడ ప్రమాదం జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కోజికోడ్ ఎయిర్ పోర్టుకు డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఏడాది కిందటే నోటీసులు పంపింది. 2019 జూలైలో ఎయిర్ పోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డీజీసీఏ అనేక లోటుపాట్లను ఎత్తిచూపింది. ఎయిర్ పోర్టు రన్ వేపై పగుళ్లను గుర్తించింది. డిజిటల్ మెట్ డిస్ ప్లే, వాయు పరికరాలు పనిచేయని విషయాన్ని డీజీసీఏ అప్పుడే గ్రహించింది. కానీ, డీజీసీఏ ప్రస్తావించిన అంశాలను మెరుగుపర్చడంలో కోజికోడ్ ఎయిర్ పోర్టు అథారిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.