కోజికోడ్ విమాన ప్రమాదంలో మరణించిన వింగ్ కమాండర్ నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు: పవన్ కల్యాణ్
- కోజికోడ్ లో ఘోర విమాన ప్రమాదం
- పైలెట్లలో ఒకరైన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే కూడా మృతి
- సాథే భారత వాయుసేనలో చిరస్మరణీయ సేవలందించారన్న పవన్
కేరళలోని కోజికోడ్ లో గతరాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ అఖిలేశ్ కుమార్ విమానయానంలో ఎంతో అనుభవం ఉన్నవాళ్లని, అయినప్పటికీ విమానం ప్రమాదానికి గురికావడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
ముఖ్యంగా, వింగ్ కమాండర్ దీపక్ వసంత్ సాథే గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చిరస్మరణీయ సేవలు అందించారని, ఆయన వ్యక్తిగతంగా కూడా తనకు తెలుసని పవన్ వెల్లడించారు. ఈ ఘోర దుర్ఘటనలో సాథే కూడా మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
"ఈ ఘటనలో పైలెట్లతో సహా 17 మంది ప్రయాణికులు కూడా మరణించడం బాధాకరం. ప్రయాణం చివరి నిమిషాల్లో ఊహించని విధంగా ఈ ప్రమాదం జరగడం విధి వైపరీత్యం. గల్ఫ్ నుంచి వచ్చిన వారు మాతృభూమిపై కాలుపెట్టే లోపే మృత్యువు కాటేసింది. మృతి చెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అంటూ పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు.