ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు... ఒక్కరోజులోనే 97 మంది కన్నుమూత
- రాష్ట్రంలో మృత్యుఘంటికలు మోగిస్తున్న కరోనా
- 1,939కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య
- మరోసారి 10 వేలకు పైగా పాజిటివ్ కేసుల నమోదు
ఏపీలో కరోనా మరణాల సంఖ్య అధికమవుతోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 97 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒక్కరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే ప్రథమం. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 14 మంది చనిపోగా, అనంతపురం జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.
మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,939కి పెరిగింది. ఇక, పాజిటివ్ కేసుల ఉద్ధృతి కూడా ఏమాత్రం తగ్గలేదు. మరోసారి 10 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే, తాజాగా 9,151 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,29,615 కాగా, ఇంకా, 85,486 మంది చికిత్స పొందుతున్నారు.