చిరంజీవి వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తాం: విష్ణువర్ధన్ రెడ్డి
- పార్టీ బలోపేతం కోసం సోము వీర్రాజు చర్యలు తీసుకుంటున్నారు
- రాజధాని అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది
- బీజేపీని దోషిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు
ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించే పనిలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తోంది. చిరంజీవిని కూడా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని... అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని సోము వీర్రాజు కలిశారనే చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.
బీజేపీలోకి చిరంజీవి వస్తామంటే సంతోషంగా స్వాగతిస్తామని విష్ణు చెప్పారు. పార్టీ బలోపేతం కోసం సోము వీర్రాజు పలు చర్యలను తీసుకుంటున్నారని తెలిపారు. అమరావతి విషయంలో బీజేపీని దోషిగా నిలిపేందుకు టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు యత్నిస్తున్నాయని విమర్శించారు. బీజేపీ వేరు, కేంద్ర ప్రభుత్వం వేరు అనే విషయాన్ని అందరూ గుర్తించాలని అన్నారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వం ఎంపిక చేస్తే... కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని చెప్పారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అమరావతికి ఆమోదం తెలిపేదని అన్నారు. రాజధానుల అంశం రాష్ట్రాల పరిధిలోనే ఉంటుందని పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చిందని చెప్పారు.