ఊరు, పేరు లేని బ్రాండ్లు పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారు: జగన్ పై వైసీపీ ఎంపీ విమర్శలు
- పాత ధరలకే మద్యం విక్రయించాలి
- ఏపీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది
- మరో 20 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలి
సొంత పార్టీపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఊరు, పేరు లేని మద్యం బ్రాండ్లను అమ్మిస్తూ జనాల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. మద్యం ధరలను భారీగా పెంచడం వల్ల... జనాలు శానిటైజర్లు తాగి చనిపోతున్నారని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు ఏపీలోనే ఉన్నాయని... మళ్లీ పాత ధరలే పెట్టాలని డిమాండ్ చేశారు.
అమరావతి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందని రఘురాజు చెప్పారు. ఏపీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉందని... ఈ పరిస్థితుల్లో విశాఖ, కర్నూలు రాజధానులు ఎందుకని ఎద్దేవా చేశారు. అమరావతితో వైసీపీకి మంచే జరుగుతోందని చెప్పారు. పక్క రాష్ట్రంలో ఎంతో అభివృద్ది జరుగుతోందని... అయినా ఫాలోయింగ్ ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ కు మూడో ర్యాంకు వచ్చిందని... దీనికి సంక్షేమ పథకాలే కారణం కావచ్చని అన్నారు. ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తున్నప్పుడు... మన రాష్ట్ర ప్రభుత్వం మరో దారిలో వెళ్లడం సరికాదని చెప్పారు. మరో 20 ఏళ్లు జగన్ సీఎంగా ఉండాలనేదే తన కోరిక అని అన్నారు.