అలాంటి లక్షణాలతో చివరి నిమిషంలో ఆసుపత్రికి వస్తే కోలుకోవడం కష్టం: ఏపీ ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి
- కరోనాపై ఆరోగ్య శాఖ సమీక్ష
- తీవ్రజ్వరం, శ్వాస సమస్యలుంటే ఆసుపత్రిలో చేరాలన్న జవహర్ రెడ్డి
- ఇలాంటి లక్షణాలు ఉన్నవారు 104 నెంబరుకు కాల్ చేయాలని సూచన
ఏపీ ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని కరోనా చికిత్స, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని స్పష్టం చేశారు. 94 కంటే తక్కువ ఆక్సిజన్ శాతం కలిగివున్నా ఆసుపత్రిలో చేరాలని సూచించారు. ఇలాంటి లక్షణాలు కలిగివున్న వారు 104 నెంబరుకు కాల్ చేయాలని తెలిపారు. చివరి నిమిషంలో ఆసుపత్రిలో చేరితే కోలుకోవడం కష్టమని స్పష్టమని పేర్కొన్నారు.
కరోనా లక్షణాలు ఉన్నవారిని ఆసుపత్రిలో చేర్చేలా చూడడం క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత అని తెలిపారు. టెస్టులతో సంబంధం లేకుండా ఆసుపత్రిలో చేర్చుకోవాలని ఆదేశించామని జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని, రాష్ట్రంలో మరణాల రేటు నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారు. ప్రతి మరణాన్ని విశ్లేషించాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు.