తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపం.. రైలు కింద పడి ఇద్దరు కుమార్తెల బలవన్మరణం
- కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘటన
- పెద్ద కూతురి భర్త నుంచి వేధింపులు
- సెల్ఫీ వీడియో తీసుకుని తండ్రి ఆత్మహత్య
తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని మనస్తాపం చెందిన ఇద్దరు కూతుళ్లు కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల వల్లే వారు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తెలిసింది. స్థానిక మయమ్మార్ కాలనీకి చెందిన బాబురెడ్డితో పెద్దమ్మాయికి పెళ్లి జరిగింది. చిన్నమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోంది.
అయితే, పెద్దమ్మాయి భర్త నుంచి వేధింపులు ఎదుర్కొంది. దీంతో బాబురెడ్డి మనస్తాపం చెందాడు. పెద్ద అల్లుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెబుతూ, ఆయన సెల్ఫీ వీడియో తీసి, నిన్న రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన బాబురెడ్డి ఇద్దరు కుమార్తెలు ఈ రోజు ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.