విమాన ప్రమాదంపై టీమిండియా క్రికెట‌ర్ల స్పంద‌న‌

  • కోజికోడ్ విమానాశ్ర‌యంలో  ప్రమాదంపై ట్వీట్లు
  • మృతుల‌కు సంతాపం
  • విమాన ప్ర‌మాద‌ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్య‌
  • అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లు
క‌రోనాతో నానా ఇబ్బందులు ప‌డుతోన్న భార‌త్ లో వ‌రుస‌గా చోటు చేసుకుంటున్న ప్ర‌మాదాలు మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. 2020 ఏడాదిలో చోటు చేసుకుంటోన్న ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌ల‌పై భార‌త‌ క్రికెట‌ర్లు తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. కేరళలోని కోజికోడ్ విమానాశ్ర‌యంలో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మ‌రో 100 మందికి పైగా ప్ర‌యాణికులు గాయాల‌పాల‌యిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై టీమిండియా క్రికెటర్లు స్పందిస్తూ బాధితుల‌కు సానుభూతి తెలిపారు.
 
విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాన‌ని టీమిండియా మాజీ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్క‌ర్ ట్వీట్ చేశారు. విమాన ప్ర‌మాద‌ వార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధితులంద‌రి కోసం ప్రార్థిస్తున్నాన‌ని టీమిండియా మాజీ ఆట‌గాడు యువరాజ్‌ సింగ్ ట్వీట్ చేశాడు. 2020 'ప్లీజ్ ద‌య‌చూపు' అంటూ ఆయ‌న పేర్కొన్నాడు.

కోజికోడ్‌ నుంచి భయంకరమైన వార్త విన్నాన‌ని, ఆ విమానం రెండు ముక్కలవ్వడం గురించి తెలుసుకుంటే భయమేసిందని గౌతం గంభీర్ చెప్పారు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు.  విమాన ప్రమాద బాధితుల కోసం ప్రార్థిస్తున్నాన‌ని కోహ్లీ అన్నాడు.

ప్రాణాలుకోల్పోయిన‌ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని చెప్పాడు. ఇదో షాకింగ్ న్యూస్ అని రోహిత్ శ‌ర్మ ట్వీట్ చేశాడు. విమాన‌ ప్రమాదంలో గాయాల‌పాలైన‌ ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పాడు.


More Telugu News