కేరళ విమాన ప్రమాదం: 19 మంది మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

  • దుబాయ్ నుంచి కోజికోడ్‌లో ల్యాండ్ అవుతూ ప్రమాదం
  • మరో 100 మందికి పైగా గాయాలు
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి, ప్రధాని
కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 19కి పెరిగింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా కోజికోడ్ వచ్చిన ఈ విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నారు.

ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే నుంచి పక్కకు జరిగి 35 అడుగుల లోయలో పడి రెండు ముక్కలైంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న ప్రధాని నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ‌న్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.


More Telugu News