జగన్ ప్రకటనపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • పోతిరెడ్డిపాడు నీటిని రాయలసీమకు తీసుకెళ్తామని జగన్ ప్రకటించారు
  • తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు
  • కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉంది
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీరని అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు అంశంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. పోతిరెడ్డిపాడు నీటిని రాయలసీమకు తీసుకెళ్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించినా... కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందని తెలిపారు. కృష్ణానది జలాల్లో తెలంగాణకు సరైన వాటా దక్కకపోతే దానికి కారణం కేసీఆరేనని అన్నారు.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపేందుకు ఒక్క అంశం కూడా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో లేదని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు వెళ్లకుండా... కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారని విమర్శించారు. నీటి సమస్యల కంటే కేబినెట్ మీటింగులే  కేసీఆర్ కు ఎక్కువా? అని దుయ్యబట్టారు.


More Telugu News