ఒక్క కరోనా కేసు వచ్చినా.. ఐపీఎల్ ముగిసినట్టే: నెస్ వాడియా

  • సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో ఐపీఎల్
  • ఆటగాళ్ల ఆరోగ్యమే ప్రధానమన్న నెస్ వాడియా
  • ఒక్క కరోనా కేసు వచ్చినా అందరి శ్రమ వృథా అవుతుందని వ్యాఖ్య
కరోనా దెబ్బకు ప్రపంచ క్రికెట్ వ్యవస్థ మొత్తం స్తంభించింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ సిరీస్ తో మళ్లీ క్రికెట్ జీవం పోసుకుంది. వచ్చే నెల 19 నుంచి యూఏఈలో ఐపీఎల్-2020 జరగబోతోంది. అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ టోర్నీ జరగబోతోంది. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో టోర్నీని నిర్వహిస్తుండటంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు సహయజమాని నెస్ వాడియా కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అన్నింటి కన్నా ఆటగాళ్ల సంరక్షణే అత్యంత ప్రధానమైనదని నెస్ వాడియా చెప్పారు. ఆటగాళ్ల ఆరోగ్యంపైనే తాము ఎక్కువ దృష్టి సారించామని తెలిపారు. ఐపీఎల్ జరగబోతోందనే విషయం మాత్రమే ఇప్పటి వరకు జట్ల యాజమాన్యాలకు తెలుసని... కానీ, ఒక్క కరోనా కేసు వచ్చినా ఐపీఎల్ కథ ముగిసిపోతుందని... ఇప్పటి వరకు అందరు పడ్డ కష్టం వృథా అవుతుందని అన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా అందరం శాయశక్తులా కృషి చేస్తున్నామని చెప్పారు.


More Telugu News