రియాకు ముంబై పోలీసులు సహకరిస్తున్నారు: సుప్రీంకోర్టుకు తెలిపిన బీహార్ పోలీసులు

  • రియాను సైడ్ చేయాలనుకుంటున్నారు
  • అనుమానాస్పద మరణం వరకే ముంబై పోలీసుల కేసు పరిధి
  • మా విచారణలో చాలా కోణాలు ఉన్నాయి
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులపై బీహార్ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి రియా చక్రవర్తికి ముంబై పోలీసులు సహకరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా తాము పని చేస్తున్నామనే ఆరోపణలకు రియా ఎలాంటి రుజువులు చూపించలేకపోయిందని చెప్పారు. బీహార్ నుంచి కేసును ముంబైకి తరలించాలంటూ రియా వేసిన పిటిషన్ పై వాదనల సందర్భంగా బీహార్ పోలీసులు ఈ మేరకు స్టేట్మెంట్ ఇచ్చారు.

రియాను తప్పించేందుకు ముంబై పోలీసులు యత్నిస్తున్నారని బీహార్ పోలీసులు చెప్పారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై మాత్రమే ముంబై పోలీసులు విచారణ చేయాలని... వారి కేసు పరిధి అంతవరకేనని తెలిపారు. తమ కేసులో మరిన్ని కోణాలు ఉన్నాయని చెప్పారు.


More Telugu News