అమెరికాలో మళ్లీ కోరలు చాచిన కరోనా... ఒక్కరోజులో 2 వేల మంది మృత్యువాత

  • మే నెల తొలివారంలో ఒక్కరోజులో 2 వేల మంది మృతి
  • మళ్లీ ఇన్నాళ్లకు అదేస్థాయిలో కరోనా మరణాలు
  • నవంబరు 3 నాటికి వ్యాక్సిన్ వస్తుందన్న ట్రంప్
కొన్నిరోజులుగా అమెరికాలో తగ్గుతున్నట్టుగా కనిపించిన కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభించింది. మే నెల తొలివారంలో ఒక్కరోజే 2 వేల మంది మరణించగా, ఆ తర్వాత ఆ స్థాయిలో మరణాలు సంభవించలేదు. మళ్లీ నిన్న ఒక్కరోజే 2 వేల మరణాలు నమోదవడం తాజా పరిస్థితికి నిదర్శనం.

అంతేకాదు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా నమోదవుతోంది. అమెరికాలో ఇప్పటివరకు 40 లక్షల మందికి పైగా కరోనా బారినపడగా, వారిలో 1.60 లక్షల మంది మృత్యువాత పడ్డారు. నిత్యం 50 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. డిసెంబరు నాటికి అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 3 లక్షలకు చేరుతుందన్న అంచనాలతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోపక్క, నవంబరు 3 నాటికి వ్యాక్సిన్ వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుండడం కాస్త ఊరట కలిగించే అంశం.


More Telugu News